
విద్యార్థులపై నిర్బంధం ఆపాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాఉద్యమాలు, విద్యార్థుల పోరా టాలపై పోలీసు నిర్బంధాన్ని వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశా రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూము ల రక్షణకు చేపట్టిన విద్యార్థుల పోరాటం అణచివేత, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులపై జరుగుతున్న అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం నూతన్‌కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాఉద్యమాలను అణచివేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల అమ్మ కం ద్వారా అధికారం నిలుపుకొనే యత్నాన్ని ప్రజ లు సహించరని హెచ్చరించారు. 400 ఎకరాల హె చ్‌సీయూ భూమిని విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులు, సీపీఎం నాయకత్వాన్ని విడుదల చేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకో వాలని డిమాండ్ చేశారు. ఇది విద్యావ్యవస్థను నిర్వీ ర్యం చేసే చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. నాయకులు ఫసీ ఉద్దీన్, పోశెట్టి, డాకూరు తిరుపతి తదితరులున్నారు.