
ఘనంగా వీరహనుమాన్ విజయయాత్ర
ఖానాపూర్: బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో మంగళవారం వీర హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి హాజరై ఎన్టీఆర్ చౌరస్తాలో మాట్లాడారు. భారతీయులంతా దేశం కోసం.. ధర్మం కోసం పని చేయాలని సూచించారు. హిందువులకు సంతాన ని యంత్రణతో ముప్పు ఉందని, ఆదాయంతో పాటు సంతానం పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లుకు త్వరలో ఆమోదం లభించనుందని, దీనిని అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పి కొడు తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. యువ త భక్తి మార్గంతో ధర్మాన్ని రక్షించుకోవాలని సూ చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు రాముడు, ఆంజనేయ విగ్రహాల దాత ఒమన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు గుండేటి గణేశ్‌ను బజరంగ్‌దళ్ నాయకులు శాలువాలతో సన్మానించారు. స్థాని క జగన్నాథ్‌రావుచౌరస్తా వద్ద ఆదిలాబాద్ గోపాల మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి ర్యాలీని ఉద్దేశించి ధార్మిక ప్రసంగం చేశారు. గుండేటి గణేశ్ సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు బజరంగ్‌దళ్ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధా న వీధుల వెంట వీరహనుమాన్ శోభాయాత్రతో ఖానాపూర్ కాషాయమయమైంది. అనంతరం శ్రీ రాంనగర్‌లోని హన్మాన్ మందిర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్, ఆర్‌ఎస్‌ఎస్ వక్త నాగమణి లింగన్న, బజరంగ్‌దళ్ జిల్లా సంయోజక్ కాసవేణి ప్రణయ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సురేశ్, నాయకులు అంకం మహేందర్, ఆకుల శ్రీనివాస్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, దయానంద్, రమేశ్, రాజశేఖర్, హనుమాన్ దీక్షాపరులు పాల్గొన్నారు.
విజయయాత్రలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, నాయకులు, భక్తులు