
కలెక్టరేట్‌లో పాపన్న వర్ధంతి
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొరలు, భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ పోరాడిన తీరును వివరించారు. పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సీపీవో జీవరత్నం, గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, కుల సంఘాల నాయకులు అమరవేణి నర్సాగౌడ్, అనుముల భాస్కర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.