
మాతాశిశు మరణాల నియంత్రణకు ‘అమ్మ రక్షిత’
నిర్మల్‌చైన్‌గేట్: మాతాశిశు మరణాలు నియంత్రించేందుకు అమ్మరక్షిత కార్యక్రమం రూపొందించినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం అమలు తీరుపై వైద్యశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేటివరకు నమోదు చేసుకున్న గర్భిణులకు సంబధించిన వివరాలు, వారిలోని ప్రమాదకర ఆరోగ్యస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గర్భస్థ మరణాలు తగ్గించేందుకు ప్రత్యేకంగా అమ్మరక్షిత కార్యక్రమం ప్రారంభించా మన్నారు. ప్రమాదకర ఆరోగ్య స్థితి ఉన్న గర్భిణులకు తగిన మందులు ఇవ్వాలని సూచించారు. అంగన్‌వాడీల ద్వారా గర్భిణులకు నాణ్యమైన పోషకా హారం అందించాలన్నారు. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య స్థితిగతులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జిల్లాలో గర్భిణుల, నవజాత శిశువుల మరణాలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్, వైద్యాధికారులు డాక్టర్ శ్రీనివాస్, సురేశ్, సౌమ్య, రవీందర్ పాల్గొన్నారు.
‘బాలశక్తి’ పకడ్బందీగా నిర్వహించాలి
బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలశక్తి కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన వైద్య పరీక్షలు, గుర్తించిన అనారోగ్య సమస్యలు, అందిస్తున్న ప్రత్యేక పోషకాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరో గ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు రూపొందించి, ఎప్పటికప్పుడు వాటిలో ఆరోగ్య వివరాలను నమో దు చేయాలన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న వి ద్యార్థులకు ప్రత్యేక ఆహారం అందించాలన్నారు. వే సవి సెలవుల్లో పోషకాహారం లోపం ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం, మందులు అందించేలా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులందరికీ అవగాహన కలిగేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులతో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ పాఠశాలలో సూచనలు, ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఈవో రామారావు, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, ఎల్‌డీఎం రామ్‌గోపాల్, అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ అభిలాష అభినవ్