
సారుకు గుణపాఠం ఎలా?
నిర్మల్
విద్యుత్ దీపాల ఏర్పాటు
‘భక్తుల భద్రత గాలిలో దీపమే’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి బాసర గ్రామ పంచాయతీ ఈవో ప్రసాద్‌గౌడ్ స్పందించారు.వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
● దారితప్పుతున్న గురువులు ● పాఠాలు చెప్పే స్థానంలో ఉండి.. పాడు పనులు ● ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కల్యాణానికి తలంబ్రాలు
లక్ష్మణచాంద: మండలంలోని చామన్‌పల్లి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవానికి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామ మహిళలు శనివారం గోటితో ఒలిచి తలంబ్రాలు సిద్ధం చేశారు. మొత్తం లక్ష నూట పదహారు(1,00,116) తలంబ్రాలను చేతిలో ఒలిచినట్లు మహిళలు తెలిపారు.
చెప్పాల్సినవారే..
‘ఇది తప్పమ్మా.. ఇలా ఉండొద్దు.. ఇలా చేయాలి.. వీరితో ఇలా ఉండాలి..’ అంటూ ఇంట్లో అమ్మానాన్నల తర్వాత బడిలో ఉపాధ్యాయుడే పిల్లలకు మంచి చెడు చెబుతుంటారు. సమాజానికి మంచి పౌరుడిని ఇవ్వాల్సిన బాధ్యతలో తల్లిదండ్రుల కంటే టీచరే ముందుంటాడు. కానీ.. అలాంటి గురుతర స్థానంలో ఉండి ఇటీవల కొందరు చేస్తున్న పనులు మొత్తం సమాజమే తలదించుకునేలా చేస్తోంది. ఒకప్పుడు ఎక్కడో ఇలా జరుగుతున్న వాటిని వార్తల్లో చూసే జిల్లావాసులు ఇప్పుడు మనదగ్గరే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎవరు చెప్పాలి..
విద్యార్థులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనల్లో చాలావరకు రాజకీయాలూ చోటుచేసుకుంటుండటం మరీ దారుణం. నిందితుడు తమ సంఘానికో, వర్గానికో చెందిన వాడైతే సదరు సంఘాలు కనీసం ఘటనలను ఖండించడం లేదు. అదే ప్రత్యర్థి సంఘాల వారైతే పనిగట్టుకుని మరీ ప్రచారం చేయిస్తున్న తీరూ సమాజంలో సదరు సంఘాలపై ఉన్న గౌరవాన్నీ తగ్గిస్తోంది. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రెండుమూడు ఘటనల్లో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యవహరించిన తీరుపైనా చర్చ కొనసాగుతోంది. తమ సభ్యుడో, ఉపాధ్యాయుడో దారి తప్పుతున్నట్లు తెలిస్తే.. మందలించి, దారిన పెట్టే బాధ్యత ఎవరిదన్న ప్రశ్న వస్తోంది. తమకేం పట్టదన్నట్లుగా ఉండే విద్యాశాఖాధికారులు, ఇటు తమ రాజకీయం తప్ప వ్యవస్థ గురించి ఆలోచించని సంఘాలు రెండింటి లోపంతో ఇలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్ పడటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
త్వరలో అవగాహన..
జిల్లాలో వరుసగా విద్యార్థినులపై టీచర్ల అఘాయిత్యాలు పెరగడం, పోక్సో కేసులు నమోదు కావడంతో రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు మసకబారుతోంది. ఈనేపథ్యంలో పలువురు సీనియర్ సిటిజనులు చేస్తున్న ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులే చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయులందరితో సమావేశాలు ఏర్పాటు చేసి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించడంతోపాటు పోక్సో వంటి చట్టాలపైనా వారికి అవగాహన కల్పించే దిశగా కలెక్టర్ అభిలాష అభినవ్ యోచిస్తున్నారు.
గురుకులాల్లో మరీ దారుణం..
న్యూస్‌రీల్
సమాజంలో ఎలా ఉండాలో చెప్పేది గురువే. తరగతి గదిలో విద్య నేర్పే ఆ గురువులే దారితప్పుతున్నారు. పసిపిల్లలపై దాష్టీకాలకు పాల్పడుతున్నారు. చదువుచెప్పే సార్లే ఇలా ఉంటే.. వారికి ఎవరు బుద్ధి చెప్పాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాఠం చెప్పే సార్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం రావడం దారుణమన్న చర్చ జిల్లాలో కొనసాగుతోంది. విద్యాశాఖపై కొంతకాలంగా ఏదో ఒక మచ్చ పడుతూనే ఉంది. మొన్నటి వరకు యూబిట్ కాయిన్ దందాలో అరెస్టులు కాగా, ఇప్పుడు ఏకంగా పోక్సో కేసుల్లో జైలు వెళ్తుండటంతో జిల్లా పరువు పోతోందన్న వాదన బలపడుతోంది. జిల్లా ఉన్నతాధికారులు దారితప్పుతున్న గురువులను గాడిలో పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. – నిర్మల్
సీరియస్‌గా తీసుకుంటాం..
జిల్లాలో అవాంఛనీయ ఘటనలపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. జిల్లా అభివృద్ధితోపాటు ఆత్మగౌరవానికీ ప్రాధాన్యతనిస్తాం. త్వరలోనే ఉపాధ్యాయులకు పోక్సోచట్టంతోపాటు వివిధ విషయాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం.
– అభిలాష అభినవ్, కలెక్టర్

సారుకు గుణపాఠం ఎలా?