
వైద్యులు సమయపాలన పాటించాలి
● డీసీహెచ్‌ఎస్ సురేశ్
భైంసాటౌన్: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన, నాణ్యమైన సే వలందించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేశ్ అన్నా రు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఓపీ గదుల్లో వైద్యుల హా జరు, ఓపీ నమోదు, రోగులకు అందిస్తున్న సేవల ను పరిశీలించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది హా జరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. పలు వార్డుల్లో కలియదిరుగుతూ ఇన్‌పేషెంట్లకు సంబంధించి కేస్‌షీట్లు పరిశీలించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రసూతి వార్డులో మూత్రశాల వసతి లేకపోవడంతో, అందుబాటులోకి తేవాలని సూపరింటెండెంట్ కాశీనాథ్‌ను ఆదేశించారు. అలాగే క్యాజువాలిటీలో మందుల నిల్వలు సక్రమంగా నిర్వహించకపోవడం, కట్లు కట్టే గదిలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మెమో జారీ చేస్తానని హెడ్ నర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్‌ను హెచ్చరించారు. అనంతరం ఫార్మసిస్ట్ గది లో మందుల నిల్వలు పరిశీలించారు. గడువు ముగి సే మందుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఫార్మసిస్ట్‌ను ఆదేశించారు. ఏ ఓపీ గదిలో ఏ వైద్యు డు అందుబాటులో ఉన్నారో రోగులకు తెలిసేలా రిజిస్టర్ మెయింటేన్ చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు కొందరు రోగులకు తమ ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని ఓ సామాజిక కార్యకర్త ఆయన దృష్టికి తేగా, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.
బాసర సీహెచ్‌సీకి స్థలం కేటాయించాలి...
బాసరలో 30 పడకలతో సీహెచ్‌సీ నిర్మాణానికి గ్రా మంలో ఐదెకరాల స్థలం కేటాయించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సురేశ్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ను కోరారు. భైంసాకు వచ్చిన ఆయన ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. బాసరలో ప్రస్తుతమున్న పీహెచ్‌సీ అర ఎకరంలో మాత్రమే ఉందని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరకు పర్యాటకుల తా కిడి ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో భవి ష్యత్ అవసరాల దృష్ట్యా సీహెచ్‌సీ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. రూ.5.75 కోట్ల నిధులు మంజూరుతోపాటు టెండర్ పూర్తయిందని తెలిపారు.