
పీహెచ్‌సీల్లో వసతులు కల్పించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులతో ఆమె సమావేశమయ్యారు. మండలాల వారీగా పీహెచ్‌సీల్లో వసతులు, మరమ్మతులు, ఇతర సామగ్రికి సంబంధించిన వివరాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అత్యవసర సేవలు, ప్ర సూతి సంబంధిత సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు విశ్రాంత ఉద్యోగులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్, పీఆర్ ఈఈ శంకరయ్య, పంచాయితీరాజ్ ఇంజినీరింగ్, వైద్యశాఖల అధికా రులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఎంసీ లింగన్న తదితరులు పాల్గొన్నారు.
పోషణ పక్షం పోస్టర్ ఆవిష్కరణ
కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ పోషణ పక్షం ప్రచార పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆవిష్కరించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార లోపంపై విస్తృత అవగాహన కలిగేలా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టర్లు ప్రదర్శించాలని అధికా రులకు సూచించారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వ రకు జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో నాగమణి, ఏసీడీపీవో నాగలక్ష్మి, జిల్లా ఆస్పత్రి ప ర్యవేక్షకుడు గోపాల్‌సింగ్, ఎంసీహెచ్ డాక్టర్ సరో జ, జిల్లా సమన్వయకర్త నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.