
వాతావరణం
ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి భానుడి భగభగలు మొదలవుతాయి. మధ్యాహ్నం వేడి ఉక్కపోత అధికంగా ఉంటుంది.
మరింత
భగభగ..!
● జిల్లాలో 44.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
భైంసాటౌన్: జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం సూరీడు సుర్రుమంటే, మంగళవారం మరింతగా మండిపోయాడు. ఐదురోజులుగా ఆరెంజ్ జోన్‌లోనే జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ రెడ్‌జోన్‌కు చేరువవుతోంది. దస్తురాబాద్ మండలకేంద్రంలో మంగళవారం 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పగటివేళ బయటికి వెళ్లాలంటే నిప్పులకొలిమిని తలపిస్తోంది.
మంగళవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు..
ప్రాంతం ఉష్ణోగ్రత
దస్తురాబాద్ 44.5
అక్కాపూర్(నిర్మల్ రూరల్) 44.3
నర్సాపూర్(జి) 44.3
ఖానాపూర్ 44.3
భైంసా 44.2
కడెంపెద్దూర్ 44.2
తాండ్ర(మామడ) 44.1
తానూర్ 44.1
పొన్కల్(మామడ) 44.1
పాత ఎల్లాపూర్(ఖానాపూర్) 44.1
పెంబి 44.0
లింగాపూర్(కడెం) 44.0