
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సారంగపూర్: గురుకులాలు, వసతి గృహాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం రుచికరంగా అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షే మ శాఖ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి నేరుగా వంటగదికి వెళ్లి విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పరిశీలించారు. సరుకుల నిల్వ గది, కూరగాయలు, ఇతర సామగ్రి నాణ్యత ను తనిఖీ చేశారు. వంట సిబ్బంది, కేటరింగ్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోజువారీ మెనూ, ఆహార తయారీ విధానాల గురించి వివరాలు తెలుసుకున్నారు. భోజన సమయంలో విద్యార్థులతో సంభాషిస్తూ, ఆ రోజు మెనూ గురించి అడిగి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ సంగీతతో చర్చించిన ఆయన, గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల సంఖ్య, వారి చదువు, ఇతర సౌకర్యాల గురించి వివరాలు సేకరించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సరైన విద్యా వాతావరణం అందేలా చూడాలని, భద్రతా విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ తనిఖీలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, డీపీవో శ్రీనివాస్, ఫుడ్ కమిషన్ కమిటీ సభ్యులు వి.ఆనంద్, ఆర్.శారద, ఎం.భారతి, బి.జ్యోతి, ఎంఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రి తనిఖీ...
నిర్మల్‌చైన్‌గేట్:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని గోలి శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అవసరమన్నారు.
● రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి