
అంబేడ్కర్ ఆశయాలు సాధించాలి
నిర్మల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు కొనసాగించాలని ముధోల్ ఎమ్మెల్యే రా మారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథో డ్ సూచించారు. అంబేడ్కర్ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జిల్లాకేంద్రంలోని మి నీట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహాన్ని పాలు, నీళ్లతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కాంగ్రెస్ అంబేడ్కర్‌ను అనేకసార్లు అవమానించిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం అంబేడ్కర్ ఆలోచనలకు పునాది వేస్తూ అ ణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు రూ పొందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో అంబేడ్క ర్ జయంతి కార్యక్రమాల కన్వీనర్ రమేశ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, రాష్ట్ర నాయకుడు అయ్యన్నగారి భూమయ్య, యువ మో ర్చా జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, పట్టణాధ్యక్షుడు సుంకరి సాయి, నాయకులు కార్తిక్, సుధాకర్, పోశెట్టి, రాజేందర్, వెంకటపతి, నాగేంద్రచారి, మారుతి తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్: పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ కాలనీ లోని అంబేడ్కర్ విగ్రహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ నీటితో శుద్ధి చేశారు. విగ్రహ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహేందర్, మనోజ్, ఉపేందర్, మురళీకృష్ణ, సంతోష్, రమేశ్, రాజశేఖర్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, సురేశ్, భూమన్న, పరమేశ్వర్, కిషన్, నర్సయ్య, సుధాకర్, శ్రావణ్, రాజేశ్వర్, సందీప్, ప్రమోద్, పొశెట్టి తదితరులు పాల్గొన్నారు.
కడెం: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కన్నాపూర్ గ్రామంలోగల అంబేడ్క ర్ విగ్రహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ శుద్ధి చేశారు. పరిసరాలను శుభ్రం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్, నాయకులు సత్తెన్నయాదవ్, మోహన్‌నాయక్, కృష్ణ, తిరుమల్, రాజేశ్, లక్ష్మణ్, భూమన్న, ఆశన్న ఉన్నారు.