
ఆస్ట్రోనామిక ల్యాబ్‌పై ఓరియంటేషన్ శిక్షణ
సోన్: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా విద్యాధికారి రామారావు చొరవతో బుధవారం ఆస్ట్రోనామిక ల్యాబ్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు దయానిధి, రిసోర్స్ పర్సన్స్ ఆర్‌ఎస్ మిశ్రా, నిషిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎంపికై న నాలుగు ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయో సైన్స్ టీచర్లకు ఆస్ట్రోనామిక ల్యాబ్ (ఖగోళ అంతరిక్ష ప్రయోగశాల) పై ఒక్కరో జు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొన్కల్, భోసి, నిర్మల్ రూరల్ (అనంతపేట్) కేజీబీవీలో రూ.5లక్షలతో ఆస్ట్రోనామికల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థి స్థాయి నుంచే అంతరిక్ష ఖగోళ వస్తువుల గురించి తెలుసుకోవడం, టెలిస్కోప్ పనిచేసే విధానం, పాఠ్యపుస్తకాల్లో వచ్చే పాఠాల్లోని ప్రయోగాలు చేసి చూడడం, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించడం, అవగాహనకు ఆస్ట్రోనా మికల్ ల్యాబ్స్ ఎంతో ఉపయోగపడతా యని తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోసైన్స్ టీచర్లు శిక్షణలో పాల్గొన్నారు. ఒక్కరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో డీఎస్వో వినోద్‌కుమార్, ప్రధానోపాధ్యాయురాలు ఆరాధన, ఉపాధ్యాయులు వందన, పూర్ణచందర్, భీమేశ్, సోషల్ ఫోరం అధ్యక్షులు రాపర్తి అశోక్, రాజగోపాల్, సుధాకర్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.