
విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: అకాల వర్షాలు, ఈదురు గాలు లతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు అ ప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఈ సుదర్శనం సూచించారు. గురువారం మండల కేంద్రంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చేపట్టిన విస్తరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రోడ్ల పక్కనున్న చిన్న స్తంభాలు తొలగించి పొడవైనవి ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట నిర్మ ల్ డీఈ నాగరాజు, ఉమ్మడి జిల్లా సివిల్ ఈఈ జనార్దన్‌రావ్, ఇన్‌చార్జి ఏడీఈ శ్రీనివాస్, లైన్‌మన్ సత్యనారాయణ, ప్రేమ్, సిబ్బంది ప్రభాకర్, నజీర్ తదితరులున్నారు.
నూతన ఫీడర్ ప్రారంభం
మామడ: మండలంలోని తాండ్ర విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో నూతన ఫీడర్‌ను ఎస్‌ఈ సుదర్శనం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఈ నాగరా జు, ఏఈ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.