
మే డే పోస్టర్ విడుదల
ముధోల్: తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మే డే పోస్టర్లను మండల కేంద్రంలో శనివారం విడుదల చేశారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు కోసం పోరాడుదామన్నారు. కార్యక్రమంలో కార్మికులు రాజేశ్వర్, భోజారాం, రాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.