నిజామాబాద్ సిటీ : నగరంలో ముఖ్యమైన జంక్షన్‌లలో హనుమాన్ జంక్షన్(వినాయక్‌నగర్) ఒకటి. హైదరాబాద్ ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న ఈ చౌరస్తా మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ చౌరస్తాలో ఏడాది క్రితం ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాని దీనిని నేటికి ప్రారంభించకపోవటంతో ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళలో చౌరస్తా దాటి ముందుకెళ్లాలంటే భయపడుతున్నారు.
రాత్రివేళల్లో ప్రమాదాలు..
వారంరోజుల క్రితం చౌరస్తాలో ఓ ఆటో బైక్‌ను ఢీకొనటంతో బైక్ ఉన్న ఇద్దరిలో ఒకరికి త్రీవంగా, మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అలాగే గతంలో డిచ్‌పల్లి వైపునుంచి వచ్చిన ఓ లారీ ఈ చౌరస్తా నుంచి వంద ఫీట్ల రోడ్డువైపు మలుగింది. ఆ సమయంలో చౌరస్తాలో ఓ వైపు టీవీఎస్ వాహనంపై ఉన్న ఒకరిని లారీ వెనుకవైపు నుంచి ఢీకొన్న ఘటనలో అతనికి కాలు విరిగింది.
మరో ఘటనలో బ్యాంక్‌కాలనీకి చెందిన ఒకరు వాకింగ్ చేస్తూ చౌరస్తా వైపు రాగా అదే సమయంలో ఓ బైక్ స్పీడ్‌గా వచ్చి అతడిని ఢీకొట్టగా అతని కాలు విరిగింది. రెండేళ్ల క్రితం డిచ్‌పల్లికి చెందిన ఒకరు టీవీఎస్‌పై చౌరస్తా దాటుతుండగా ఓ ఆటో ఇతడిని ఢీకొట్టడంతో అక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా మరికొన్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
సిగ్నల్ లైట్లు అమర్చినా..
హనుమాన్ జంక్షన్‌లో ప్రమాదాలు నిరోధించేందుకు మున్సిపల్, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కాని కారణం ఏమిటోగాని ఇప్పటికీ వీటిని ప్రారంభించలేదు. నిత్యం వేలాది సంఖ్యలో తిరుగుతున్న ఈ మార్గంపై ఉన్న చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను వెంటనే ప్రారంభించాలని చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రమాదాలు అరికట్టాలి
హనుమాన్ జంక్షన్‌లో ట్రా ఫిక్ సిగ్నల్ మొదలుపెట్టక పోవటంతో తరుచుగా జరు గుతున్న ప్రమాదాలను అరి కట్టాలి. ఈ చౌరస్తా మీదుగా 24 గంటలపాటు వాహనా ల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియకుండా ఉంది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – సుబ్బారావు, వినాయక్‌నగర్
ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి
హనుమాన్ చౌరస్తా మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య గత ఐదేళ్లుగా ఎంతో పెరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకపోవటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment