ఒక దాడి.. రెండు పార్టీల రగడ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో భూకబ్జాలు, ఆక్రమణల కథలు మలుపులు తి రుగుతున్నాయి. నగరంలో చెరువులు, అటవీ భూ ములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లు చేశారు. దీంతో అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. సివిల్ వివాదాలు కాస్త క్రిమినల్ వ్యవహారాలుగా మారుతున్నాయి. తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. తాజాగా మేయర్ నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ మీద చోటుచేసుకున్న దాడి ఘ టన నేపథ్యంలో పార్టీల మధ్య వాడి వేడి వాతావరణం నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య రగడ నెలకొంది. ఇరు పార్టీల నాయకుల మధ్య పరస్పర ఆరోపణల పర్వం, మా టల యుద్ధం నడుస్తోంది. దాడి ఘటనలో కాంగ్రెస్ నాయకుల హస్తమందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని, దాడి చేస్తూ వీడియో తీశారంటేనే ఇది పక్కా ప్లాన్ అని అర్థమవుతోందని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శాంతిభద్రతలు బాగున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆరోపిస్తున్నారు.
● దాడికి పాల్పడిన రసూల్ మాత్రం తన భూమిని ఆక్రమించి దండు శేఖర్ తనకు అన్యాయం చేశాడని, కాంగ్రెస్ నాయకులే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశా డు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నెలకొంది. దండు శేఖర్‌పై చేసిన దాడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారెవరికీ సంబంధం లేదని డీసీసీ అధ్యక్షు డు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులే విచ్చలవిడిగా కబ్జాలు చేశారని, ఈ విషయమై బాధితులు ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వం తగిన విచారణ చేస్తుందని మానాల అన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు దళితబంధు పథకం విషయంలోనూ భారీగా డబ్బులు వసూలు చేశారన్నారు. దాడికి గురైన దండు శేఖర్ ఇద్దరు కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పాడని మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆరోపించడంతో.. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు స్పందించారు. బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు నిరూపిస్తే సదరు వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కేశ వేణు పేర్కొన్నారు. దండు శేఖర్‌పై దాడి బీఆర్‌ఎస్ అంతర్గత విషయమన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దాడికి పాల్పడిన రసూల్ దండు శేఖర్ అనుచరుడిగా పదేళ్లు కొనసాగాడని వేణు పేర్కొనడం గమనార్హం. తాజాగా పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుందని కేశ వేణు చెబుతుండడం పట్ల నగరంలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా నగరంలోని ఒక్క నాగారం ప్రాంతంలోనే 2700 ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని, ఈ విషయాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వంతో తక్షణమే విచారణ చేయిస్తామని వేణు పే ర్కొనడం విశేషం. ఫిర్యాదులు చేసిన బాధితులకు రక్షణ కల్పిస్తామని చెబుతుండడం గమనార్హం. ఇంత తతంగం గమనిస్తున్న నగర ప్రజలు మాత్రం కబ్జాలు, ఆక్రమణలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ కేసులు పెట్టకుండా తమకేం తెలియదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఆరోపణలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు బాధితులు ఫిర్యాదులు చేయాలని మాత్రమే అనడమేమిటని ప్రశ్నిస్తున్నారు. చెరువులు, వాగు లు, కాలువలు కబ్జా అయిన విషయమై సర్వే చేసి కేసులు పెట్టకుండా తాత్సారం చేయడం తగదని పలువురు అంటున్నారు. పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం గడపుతున్నాయంటున్నా రు. నిజామాబాద్‌లో తక్షణమే హైడ్రా మాదిరిగా నిడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మేయర్ భర్తపై దాడి నేపథ్యంలో
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మాటల యుద్ధం
హస్తం నాయకుల ప్రమేయం
ఉందంటున్న గులాబీ నేతలు
తమ వారి హస్తముంటే పార్టీ నుంచి
బహిష్కరిస్తామంటున్న కాంగ్రెస్
నాయకులు
బీఆర్‌ఎస్ హయాంలో వేల ప్లాట్లు కబ్జా.. బాధితులు ఫిర్యాదులు చేస్తే విచారిస్తామంటున్న అధికార పార్టీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment