‘ఎమ్మెల్సీ’ పోలింగ్ కేంద్రాలు 81
● పట్టభద్రులకు 48,
ఉపాధ్యాయులకు 33
● కలెక్టర్ రాజీవ్‌గాంధీ
హనుమంతు వెల్లడి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జిల్లాలో మొత్తం 31,574 ఓట్లు ఉండగా 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 3,751 ఓట్లు ఉండగా 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల అధికారులకు శిక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఘనంగా సంత్
సేవాలాల్ జయంతి
నిజామాబాద్‌అర్బన్: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భోగ్ బండార్‌లో పాల్గొని నైవేద్యం స్వీకరించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ–2008
అభ్యర్థులకు పోస్టింగ్
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణ యం మేరకు డీఎస్సీ–2008 అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ శనివారం కౌన్సెలింగ్ నిర్వ హించి పోస్టింగ్‌లు ఇచ్చింది. జిల్లాలో 74 మందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. తమకు కేటాయించిన పాఠశాలల్లో సోమవారం రిపోర్ట్ చేయాలని డీఈవో ఆదే శించారు. 18 సంవత్సరాలుగా పోరాడిన డీఎస్సీ–2008 అభ్యర్థులు తమకు ఉద్యోగం కల్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘ఎమ్మెల్సీ’ పోలింగ్ కేంద్రాలు 81
Comments
Please login to add a commentAdd a comment