స్కేటింగ్ క్రీడాకారులకు ఘన సన్మానం
నిజామాబాద్‌నాగారం : లస్సనియా స్కేటింగ్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలను ఈనెల 16,17న నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నుంచి వివిధ కేటగిరీలలో దాదాపుగా 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 8 మంది బంగారు, 12 మంది రజత, 10మంది క్రీడాకారులు కాంస్య పతకాలను సాధించినట్లు రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామచందర్ తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు బహుమతులు అందుకున్నారు. ఈసందర్భంగా క్రీడాకారులను సన్మానించారు. జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మహిపాల్, యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా వాలీబాల్ కోచ్ సాయిలు, స్కేటింగ్ కోచ్‌లు గణేష్, శంకర్, జయరాం, సాయి శ్రీధర్ నాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment