కర్నాటి యాదగిరి ఆదర్శప్రాయుడు
నిజామాబాద్ సిటీ : కమ్యూనిస్టు నాయకుడిగా సుదీర్ఘంగా సీపీఐ(ఎం.ఎల్) పార్టీకి సేవలందించిన కర్నాటి యాదగిరి ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కే.రమ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో యాదగిరి సంస్మరణ సభ నిర్వహించారు.ఈకార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని జీవితాంతం విప్లవోద్యమంలోనే కొనసాగారన్నారు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా 40 ఏళ్లు పనిచేశారన్నారు. యాదగిరి అంకితభావం యువతరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మరణించిన తర్వాత కూడా వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తమ శరీరాన్ని, నేత్రాలను దానం చేశారన్నారు. ఈకార్యక్రమంలో వామపక్ష నాయకులు వి.ప్రభాకర్, ఎం.నరేందర్, పి.రామకృష్ణ, ఎం.వెంకన్న, బి.దేవారం, డి.రాజేశ్వర్, ముష్కసుధాకర్, గంగాధర్, ముత్తెన్న, సాయన్న, మల్లేష్, సురేష్, కిషన్, సత్తెక్క, డి.కిషన్, రమేష్, మురళి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment