కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ నాగారం: తమ భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు రమేష్, గజ్జల గంగామణిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సోమవారం వారు మాట్లాడారు. రెంజల్ మండలంలోని వీరన్న గుట్ట గ్రామ శివారులో 1292 సర్వేనెంబర్ లో గల తమ 11 గుంటల భూమిని గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని వారు ఆరోపించారు. భూమిని కబ్జా చేసుకోవడమే కాకుండా కంచె వేసుకున్నారని, దీనిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమకు అతని నుంచి ప్రాణాహని ఉందని, ఉన్నతాధికారులు స్పందించి శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment