నేడు, రేపు జిల్లాలో వామపక్షాల నిరసనలు
నిజామాబాద్ సిటీ : కేంద్ర బడ్జెట్లో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18, 19న జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వామపక్షాల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ... బడ్జెట్‌లో పేదలను విస్మరించడం, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేటాయింపులు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజాస్వామ్యవాదులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వామపక్ష నాయకులు రమేష్‌బాబు, సుధాకర్, ఆకుల పాపయ్య, పెద్ద వెంకట్ రాములు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నాయకులు
Comments
Please login to add a commentAdd a comment