మనమెంతో మనకంత రిజర్వేషన్లు దక్కాల్సిందే
నిజామాబాద్‌నాగారం: మనమెంతో మనకంత రిజర్వేషన్లు దక్కాల్సిందేనని... వందేళ్ల తర్వాత కుల గణన జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. గురువారం నిజామాబాద్ నగరంలోని మేరు భవన్‌లో జరిగిన బీసీ కులగణనపై బీసీ సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. బీసీ బిడ్డ మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులు కావడంతోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన సాధ్యం అవుతోందన్నారు. మహేశ్ కుమార్‌గౌడ్‌కు బీసీ సంక్షేమ సంఘం కుల గణన కోసం విన్నవించిందన్నారు. ఎప్పుడో వంద ఏళ్ల కిందట 1931 లో బ్రిటీష్ వారు జరిపిన కులగణనలో మనం 54 శా తం ఉన్నామని తెలిసిందని, అప్పుడు కేవలం 30 నుంచి 40 కులాలే మన బీసీల లిస్టులో ఉన్నాయన్నారు. ఇప్పుడు దాదాపు 130 కులాలు ఉన్నాయని, ఇప్పుడు మనం దాదాపు 60 శాతం ఉంటామని, మనమెంతో మనకు అంత వాటా దక్కాల్సిందే అన్నారు. బీసీ కులగణన జరిగితేనే మన రిజర్వే షన్లకు రాజ్యాంగ బద్ధత వస్తదని అన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, ఉద్యోగ సంఘం నాయకుడు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపే రవీందర్, దర్శనం దేవేందర్, పోల్కం గంగాకిషన్, కొయ్యాడ శంకర్, శ్రీలత, నారాయణ రెడ్డి, సత్యప్రకాశ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment