బీజేపీ అభ్యర్థుల విజయం తథ్యం..
సుభాష్‌నగర్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ సరళి, పోలింగ్ శాతా న్ని పరిశీలిస్తే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్, పాలిటెక్నిక్, సీఎస్‌ఐ, నిర్మల హృదయ కళాశాలలోగల పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఉపాధ్యాయులు, పట్టభద్రులకు స్లిప్పులు అందజేశారు. ధన్‌పాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతుందని, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment