
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ సరళి ఇలా..
ముబారక్‌నగర్‌లోని పోలింగ్ సెంటర్‌లో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లు
పోలింగ్ ఓటేసిన శాతం ఓటేసిన శాతం
సమయం పట్టభద్రులు టీచర్లు
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 3,011 9.5 599 15.97
మధ్యాహ్నం 12 వరకు 8,665 27.44 1,580 42.12
మధ్యాహ్నం 2 వరకు 15,766 49.93 2,484 66.22
సాయంత్రం 4 వరకు 24,388 77.24 3,468 92.46
ఉపాధ్యాయులదే పైచేయి
నిజామాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతంలో పట్టభద్రుల కన్నా ఉపాధ్యాయులదే అధికంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్లలో పట్టభద్రుల పోలింగ్ 77.24 శాతం నమోదుకాగా, ఉపాధ్యాయులు 92.46 శాతం మంది ఓట్లు వేశారు. పట్టభద్రుల ఓటింగ్‌లో పురుషులు 15,663 మంది, మహిళలు 8,725 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉపాధ్యాయుల్లో పురుషులు 2135 మంది, మహిళలు 1333 మంది ఓటేశారు. జిల్లాలో మొత్తం పట్టభద్ర ఓటర్లు 31,574 మంది ఉండగా 24,388 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి జిల్లాలో 3,751 మంది ఓటర్లు ఉండగా 3,468 మంది ఓటు వేశారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 48 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం పట్టభద్రుల ఓట్లు 31,574 ఉండగా 24,388 మంది ఓటేశారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 3,751 మంది ఉండగా 3,468 మంది ఓట్లేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 33 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ముబారక్‌నగర్ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ కాషాయ కండువా వేసుకోవడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. నిర్మల హృదయ పాఠశాలతోపాటు ముబారక్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో వీల్‌చైర్లు లేకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ కేంద్రంలో చిన్నబాబును ఎత్తుకొని ఓటేసేందుకు వచ్చిన ఓ మహిళను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఓటు వేయకుండానే వెనుదిరిగింది.
ఆరు సెంటర్లలో వంద శాతం పోలింగ్
నిజామాబాద్‌అర్బన్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం ఓటింగ్ నమోదైంది. సి రికొండ పోలింగ్ కేంద్రంలో మొత్తం 25మంది, రెంజల్‌లో 13మంది, చందూర్‌లో 17మంది, పోతంగల్‌లో 12మంది, రుద్రూరు పోలింగ్ కేంద్రంలో 49మంది, బాల్కొండ పోలింగ్ కేంద్రంలో 28 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిచ్‌పల్లి సెంటర్‌లో 97.56 శాతం ఓటింగ్ నమోదైంది. అతి తక్కువగా మోస్రా పోలింగ్ కేంద్రంలో 75 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటేసిన పట్టభద్రులు 24,388..
ఓటింగ్ శాతం 77.24 నమోదు
టీచర్ల ఎమ్మెల్సీకి పోలైన ఓట్లు 3,468..
ఓటింగ్ శాతం 92.46 నమోదు
సౌకర్యాల కరువుతో ఇబ్బందిపడ్డ వృద్ధులు, దివ్యాంగులు
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్

ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment