
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నగరంలోని 33/11 కేవీ తిలక్‌గార్డెన్ సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్‌లోని 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్తగా 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
మార్చి 1న బైక్ సైక్లింగ్ జిల్లా జట్ల ఎంపికలు
నిజామాబాద్‌నాగారం: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో మార్చి 1న మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీలకు జిల్లాస్థాయి జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌కాంత్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 7 నుంచి 9వరకు హైదరాబాద్‌లో జరుగనున్న 9వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్‌సైక్లింగ్ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు అండర్ 14, 16 ,18 బాలురు, బాలికలు, పురుషులు, మహిళలు విభాగంలో చేపడతామన్నారు. ఆసక్తి ఉన్న వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం ఏడు గంటలకు రిపోర్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 99128 83331ను సంప్రదించాలన్నారు.
తూం తలుపులు
తెరిచేదెట్లా?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరాఫరా చేసే ప్రధాన కాలువకే కాదు.. ఉప కాలువలకు కూడా తూం తలుపులు ఎత్తడానికి లష్కరులకు తిప్పలు తప్పడం లేదు. తూం తలుపులు ఎత్తడానికి ఎలక్ట్రానిక్ విధానం ఏర్పాటు చేసినా పనిచేయక పోవడంతో తలుపులు పైకి రావడం లేదు. దీంతో లష్కర్లు నిత్యం చేతులతో తిప్పుతూ తలుపులను ఎత్తుతున్నారు. గురువారం ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో లక్ష్మి కాలువ డీ–4 తలుపులు ఎత్తడానికి లష్కరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తలుపులను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment