మావోయిస్టు నక్సలైట్ ఉద్యమంలో జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. కొత్తగూడెం భద్రాద్రి, ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నక్సలైట్లు శుక్రవారం ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతలేమితో, ఇతర అనేక కారణాలతో బలహీనపడిందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గడ్‌లో చాలా మంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, సానుభూతి పరులు పార్టీని వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని లొంగిపోయిన మావోయిస్ట్‌ల ద్వారా తెలిసిందన్నారు. జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారన్నారు. వారు కూడా లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. వారు స్వతంత్రంగా జీవించడానికి అన్ని రకాలుగా సాయం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment