బురదలో పడి రైతు మృతి
రుద్రూర్: మండలకేంద్రంలో ఓ రైతు పొలం గట్టుపై వెళుతుండగా ప్రమాదవశాత్తు బురదలో పడి మృతిచెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన కాడరి సాయినాథ్ (38) అనే రైతు గురువారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. గట్టుపై నడుచు కుంటు వెళుతుండగా అకస్మత్తుగా బురదలో పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య అర్చన శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఫిట్స్ రావడంతో కాలువలో పడి ఒకరు..
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామంలో ఓ వ్యక్తికి ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతిచెందినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరీఫ్ తెలిపారు. వివరాలు ఇలా.. శ్రీనగర్ గ్రామానికి చెందిన చండీ కృష్ణ(37) వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవాడు. రోజువారి మాదిరిగా శుక్రవారం అతడు స్థానిక పంటపొలాలకు వెళ్లగా, ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న కాలువలో పడి, మృతిచెందాడు. అతడిని స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment