అధికారుల నిర్బంధం
సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలై వారం రోజులైనా అధికారుల పర్యవేక్షణ లోపంతో పొలాలకు నీళ్లందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ డీఈ భూమన్న, ఏఈ సత్యనారాయణ శుక్రవారం సాలూర మండలంలోని సాలూర క్యాంప్ గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద రైతులతో సమావేశమై నీటి సమస్యపై చర్చించారు. అధికారుల రాకను తెలుసుకొని సాలూర క్యాంప్, జాడిజమాల్‌పూర్, ఫత్తేపూర్ గ్రామాల రైతులు తరలివచ్చారు.
అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు పంచాయతీ ఆఫీసులో వారిని నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న ఏఈ శృతి (కాలువ పర్యవేక్షకురాలు), బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎస్సై మచ్చేందర్ సాలూర క్యాంప్‌నకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం అధికారులను విడిపించి, రైతులతో కలిసి కాలువలో నీటి పారకం పరిస్థితిని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment