ప్రమాదకరంగా మూల మలుపులు
ధర్పల్లి: నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్లు మూల మలుపులతో ప్రమాదంగా మారాయి. గత ప్రభుత్వం రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా పెట్టిన చెట్లు రోడ్డు సగభాగం వరకు విస్తరించాయి. దీంతో వాహనదారులు మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
మండలంలోని హోన్నాజీపేట్, వాడి గ్రామానికి వెళ్లే మార్గంలో పలుచోట్ల మూలమలుపులు ఉన్నాయి. చెట్లు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగిన చోట మూల మలుపు కనిపించని పరిస్థితి నెలకొంది. సిరికొండ మండలం గడ్కోల్, తూంపల్లి, కొండాపూర్, పాకాల, గడ్డమీద తండా, ధర్పల్లి మండలం కర్నల్ తండా, నడిమి తండా, కొట్టల్‌పల్లి, హోన్నాజీపేట్ పలు గ్రామాల నుంచి వందలాది వాహనదారులు నిత్యం ధర్పల్లి మండల కేంద్రం పాటు జిల్లా కేంద్రానికి రాకపోకలు ఈ మార్గం గుండానే కొనసాగిస్తారు. గడ్కోల్ నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో హోన్నాజీపేట్ పెద్దమ్మ ఆలయం, వాడి గ్రామం వద్ద మూడు ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. ఇక్కడ మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా చెట్లు భారీగా పెరిగాయి. దీంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ మూల మలుపుల వద్ద గతంలో వాహనాలు ఢీకొని గాయపడ్డ పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. మూల మలుపుల వద్ద వాహనదారులకు రోడ్డు స్పష్టంగా కనిపించేలా చెట్ల కొమ్మలు, ముళ్ళ పొదలు తొలగించి, అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే వేగ నియంత్రణకు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు
సూచిక బోర్డులు కరువు
పట్టించుకోని అధికారులు
ఇబ్బందుల్లో వాహనదారులు
చెట్ల కొమ్మలు తొలగించాలి
మూల మలుపుల వద్ద వాహనదారులు ప్రమాదాలకు గురై ఇప్పటికే పలువురు మంచానికే పరిమితమయ్యారు. మూల మలుపుల వద్ద ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను వెంటనే తొలగించారు. అధికారులు చొరవ తీసుకొని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
– తిరుపతి, వాహనదారుడు, కార్నల్ తండా
ప్రమాదకరంగా మూల మలుపులు
ప్రమాదకరంగా మూల మలుపులు
Comments
Please login to add a commentAdd a comment