కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి

Published Sat, Mar 1 2025 7:53 AM | Last Updated on Sat, Mar 1 2025 7:52 AM

కేంద్

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి

నిజామాబాద్‌నాగారం: కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాస రాజేశ్వర్‌ అ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో గోపిక, శ్రీనివాస్‌, రాజేంద్రసాగర్‌, అమరిక, నాగమణి, భారతి, దేవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు

పరీక్ష ప్యాడ్ల పంపిణీ

సిరికొండ: మండలంలోని తూంపల్లిలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ప్యాడ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో రాములు, ఫౌండేషన్‌ చైర్మన్‌ అయినాల శ్రీకాంత్‌, సభ్యులు యశ్వంత్‌, ప్రశాంత్‌, బాలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

సిరికొండ: మండలంలోని తాళ్లరామడుగులో ఉన్న రామాలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.

జాదూ రంగనాథ్‌కు అవార్డు

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా సీనియర్‌ మెజీషియన్‌ జాదూ యుగందర్‌ రంగనాథ్‌కు సర్కార్‌ మెమోరియల్‌ అవార్డు లభించింది. ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పి.సి. సర్కార్‌ జయంతిని పురస్కరించుకొని గురువారం రాత్రి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సహకారంతో ఆర్కేస్‌ వండర్‌ వరల్డ్‌, తెలంగాణ మ్యాజిక్‌ ఆకాడమి సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ ఇంద్రజాలికుల వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద, మ్యాజిక్‌ స్టార్‌ బోసుల చేతులమీదుగా రంగనాథ్‌ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రంగనాథ్‌ అన్నారు.

కంట్రోలర్‌, ప్రిన్సిపాల్‌కు సన్మానం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె సంపత్‌కుమార్‌, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ మామిడాల ప్రవీణ్‌ను శుక్రవారం వర్సిటీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది సన్మానించారు. ఇరువురిని వేర్వేరుగా శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సాయాగౌడ్‌ మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధిలో నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, బోధనా సిబ్బందితో కలిసి సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకౌంటెంట్‌ భాస్కర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు బాగా చదవాలి

నిజామాబాద్‌అర్బన్‌: విద్యార్థులు బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని నిశిత కళా శాల చైర్మన్‌ నిఖిల్‌ అన్నారు. నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో డాటా సైన్స్‌ చదువుతున్న ప్ర థమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యా ర్థులు గెట్‌ టు గెదర్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు ఆట, పాటలతో అందరిని అలరించారు. కార్యక్రమంలో వినయ్‌కుమార్‌, రాజు, డాక్టర్‌ ఓంషేక్‌, స్వప్న, మధుసూదనచారి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పరీక్ష అట్టల పంపిణీ

డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి)లో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థులకు శుక్రవారం టాటా ఏఐఏ ఇన్సూరెన్స్‌ ఆ ధ్వర్యంలో శుక్రవారం పెన్నులు, పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. టాటా ఏఐఏ డైరెక్టర్‌ భరణి, సాయినాథ్‌, శ్యామ్‌ ప్రసాద్‌, హబీబ్‌, ప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కేంద్ర ప్రభుత్వం  కులగణన చేయాలి 
1
1/4

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి

కేంద్ర ప్రభుత్వం  కులగణన చేయాలి 
2
2/4

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి

కేంద్ర ప్రభుత్వం  కులగణన చేయాలి 
3
3/4

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి

కేంద్ర ప్రభుత్వం  కులగణన చేయాలి 
4
4/4

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement