క్రైం కార్నర్
కారును ఢీకొన్న లారీ
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి తండాకు చెందిన పూల్‌సింగ్ (39) తన భార్య సునీత, చెల్లెళ్లు శోభ, వినీతతో కలిసి శనివారం కామారెడ్డిలో చదువుతున్న పిల్లల దగ్గరికి కారులో వెళ్లారు. అనంతరం స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో నారాయణ్‌ఖేడ్‌కు చెందిన బంధువులు పూల్‌సింగ్‌కు ఫోన్ చేయగా, వారిని ఎల్లారెడ్డిలో ఎక్కించుకొని రాఘవపల్లితండాకు వెళ్తున్నారు. మాచాపూర్ శివారులో హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్తున్న లారీ, కారును బలంగా ఢీకొట్టడంతో పూల్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో నారాయణ్‌ఖేడ్‌కు చెందిన తల్లి స్వరూప, కూతురు చిట్టి తలకు తీవ్రగాయాలవ్వడంతో హైదరాబాద్‌కు తరలించారు. జ్యోతి, శోభ, వినీత, సునీతలను ఎల్లారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
మరో నలుగురికి గాయాలు
క్రైం కార్నర్
క్రైం కార్నర్
క్రైం కార్నర్
Comments
Please login to add a commentAdd a comment