విద్యుదాఘాతంతో మహిళ మృతి
మాచారెడ్డి : మండలంలోని లచ్చాపేట గ్రామశివారులో ఓ మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. గజ్యానాయక్ తండాకు చెందిన లావుడ్యా పొరాలి (45) సొంత పనిపై లచ్చాపేట నుంచి కాలినడకన తిరిగి వస్తుండగా రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దేశాయిపేటకు చెందిన జక్కుల దేవేందర్ పొలం చుట్టూ అడవి పందుల కోసం అమర్చిన కరెంటు వైర్లు తగిలాయి. దీంతో పొరాలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఘటన స్థలాన్ని ఏఎస్పీ చైతన్యరెడ్డి, రూరల్ సీఐ రామన్ శనివారం పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడు ..
ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన శ్రీకాంత్(23) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై వంశీచందర్‌రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా.. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జాన్కంపేట్ శివారులో ట్రాక్టర్ డ్రైవర్ సిరివెని రవి అటుగా వెళ్తుండగా శ్రీకాంత్ లిఫ్ట్ అడిగి ఎక్కినట్లు తెలిపారు. ఆకస్మాత్తుగా ట్రాక్టర్ మీది నుంచి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. మృతుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment