గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా
● తప్పిన భారీ ప్రమాదం
నిజామాబాద్ రూరల్: నగర శివారులోని సారంగాపూర్ సమీపంలో నిండు గ్యాస్‌తో ఉన్న సిలిండర్లను తరలిస్తున్న లారీ శనివారం సాయంత్రం బోల్తాపడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..హైదరాబాద్ నుంచి సారంగాపూర్ డెయిరీఫాం వద్ద ఉండే గోదాముకు ఓ లారీ నిండు సిలిండర్లను తరలిస్తోంది. తాజ్‌దాబా వద్ద మూలమలుపునకు రాగానే ఒక్కసారిగా లారీ బోల్తాపడింది. దీంతో సిలిండర్లన్నీ కిందపడిపోగా.. ఆ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. సిలిండర్లు ఎక్కడ పేలుతాయోనని భయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆరోటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ సిలిండర్లను అక్కడి నుంచి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment