వర్సిటీ మైనారిటీ సెల్ డైరెక్టర్‌గా అబ్దుల్ ఖవి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మైనారిటీ సెల్ డైరెక్టర్‌గా డాక్టర్ మ హ్మద్ అబ్దుల్ ఖవి ని యమితులయ్యారు. తెయూ వైస్‌చాన్స్‌ల ర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి శనివారం అబ్దుల్ ఖవికి నియామక ఉత్తర్వులు అందజేశారు. గత పది సంవత్సరాలుగా ఆయన ఉర్దూ విభాగంలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో ౖమైనారిటీ సెల్ డైరెక్టర్‌గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్‌లకు అబ్దుల్ ఖవి కృతజ్ఞతలు తెలిపారు.
ఇందూరు
కవులకు ఘన సత్కారం
నిజామాబాద్ రూరల్: నగరానికి చెందిన ప్రముఖ కవులు డాక్టర్ గణపతి, అశోక్ శర్మ, డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, డాక్టర్ కన్యాల ప్రసాద్, చింతల శ్రీనివాస్ గుప్తను నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి కళాపీఠం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. బాసర ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, ప్రముఖ కళాకారుడు రఘు ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రత్యేకంగా కవులు, కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా కవులకు సరస్వతీపుత్ర అనే బిరుదును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
డీఎంను కలిసిన రేషన్‌డీలర్లు
సుభాష్‌నగర్: సివిల్ సప్లయ్ డీఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌రెడ్డిని జిల్లా రేషన్ డీ లర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎంకు శాలువా, పుష్పగు చ్ఛం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అతిమేల నాగేశ్, గౌరవాధ్యక్షుడు పోల్కంగంగాకిషన్,ప్రధాన కార్యదర్శి పార్థ సారథి, నగర కార్యదర్శి ప్రవీణ్ యాదవ్, సంయుక్త కార్యదర్శి కిరణ్‌కుమార్, రాజారాం, రవి, రమేశ్, రవీంద్ర, రఘు తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ హెల్ప్ డెస్క్
బోధన్: బోధన్ మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని కమిషనర్ వెంకటనారాయణ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్‌లో సంప్రదించి ని వృత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్ర భుత్వం అనధికారిక లేవుట్‌లు, ప్లాట్లు క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. 2020లో దరఖాస్తు చేసు కున్న వారు ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తా జాగా జీవో నంబర్ 28 ద్వారా ఆదేశాలు ఇ చ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. వివరాలకు హెల్ప్‌డెస్క్ నంబర్ 63017 07191ను సంప్రదించాలని సూచించారు.
వర్సిటీ మైనారిటీ సెల్ డైరెక్టర్‌గా అబ్దుల్ ఖవి
వర్సిటీ మైనారిటీ సెల్ డైరెక్టర్‌గా అబ్దుల్ ఖవి
Comments
Please login to add a commentAdd a comment