చైన్‌స్నాచర్ అరెస్టు
బిచ్కుంద(జుక్కల్): ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళా ప్రయాణికులనే టార్గెట్‌గా చేసుకొని ఆరు నెలలుగా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితురాలిని బిచ్కుంద పోలీసులు పట్టుకున్నారు. బిచ్కుంద స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నరేశ్ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ఔరాద్ తాలూకా, కమల్‌నగర్ గ్రామానికి చెందిన శాంతాబాయి కొన్ని నెలల నుంచి బస్టాండ్‌లో రద్దీగా ఉన్న బస్సులో ఎక్కుతున్న మహిళల మెడలో నుంచి బంగారు నగలు అపహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు గోడమీది సాయవ్వ, గాండ్ల సాయవ్వ, దొమటి శకుంతల, సాయవ్వ తమ బంగారు నగలు పోయాయని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్నినెలల నుంచి బిచ్కుంద బస్టాండ్‌లో నిఘా పెట్టారు. శనివారం బస్టాండ్‌లో చోరీకి పాల్పడుతున్న శాంతాబాయిని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నలుగురు ప్రయాణికుల నగలు అపహరించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. శాంతాబాయి నుంచి 5 తులాల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బంది మహ్మద్ నదీమ్‌ను అదనపు ఎస్పీ నరసింహారెడ్డి అభినందించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
● 5 తులాల బంగారం స్వాధీనం
● రిమాండ్‌కు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment