సాగునీటి సమస్య తలెత్తితే మీరే బాధ్యులు
ఎరువులు అందుబాటులో
ఉంచాలి
యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ హనుమంతు ఆదేశించారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈసారి 77 వేల మెట్రి క్ టన్నులకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. జిల్లా రైతుల అవసరాలకు సరిపడా స్టాక్‌ను ముందుగానే తెప్పించుకుని అన్ని ప్రాంతాల రైతులకు అందుబాటు ఉండేలా చూడాలన్నారు.
బోధన్: జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నతమైతే సంబంధిత శాఖ అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. సాగు నీటి సరఫరా ను సక్రమంగా పర్యవేక్షించకుండా అలసత్యాన్ని ప్ర దర్శిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బో ధన్ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి డివిజన్ స్థాయి నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులు, చెరువులు, కాలువల కింద ఆయకట్టు పరిధిలోని పంటల పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరుల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో నీటి నిల్వలు ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఎక్కడా పంటలకు సాగు నీరందించే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో నీటి చౌర్యం జరగకుండా నిఘా పెట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడైనా సాగు నీటి సరఫరా కు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటే ముందుగానే స మస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనిన్నారు. రానున్న నెలన్నర రోజులపాటు సాగు నీటి పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సూచించారు.
పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి
ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతోపాటు ఇతర సంస్థల నుంచి రా వాల్సిన ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయా లని కలెక్టర్ సూచించారు. వంద శాతం పన్ను వసూలయ్యేలా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉన్న వారికి నోటీసులు జారీ చేయాలని, అయినప్పటికీ స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత అధికారులకు
స్పష్టం చేసిన కలెక్టర్ హనుమంతు
బోధన్ ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో
సమీక్ష సమావేశం
నీటి చౌర్యంపై నిఘాపెట్టాలని ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment