6 నుంచి రైల్వేగేట్ మూసివేత
ఎడపల్లి(బోధన్): అండర్ పాస్ నిర్మించనున్న నేపథ్యంలో ఎడపల్లి మండలంలోని బషీర్‌ఫారం రైల్వే గేటును ఈ నెల 6 నుంచి మూసి వేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ఇంజినీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎడపల్లి తహసీల్, పోలీస్‌స్టేషన్, మండలంలోని పోచారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి రైల్వే అధికారులు ముందస్తుగా నోటీ సులు అందించారు. గతంలో రైల్వేగే టును మూసి వేయడంతో తాము ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం అండర్ పాస్ నిర్మా ణం పేరుతో మళ్లీ గేటును మూసివేస్తున్నా రని పోచారం గ్రామస్తులు అంటున్నారు.
డెమో రైలు రద్దు
ఖలీల్‌వాడి: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో కాచిగూడ – నిజామాబాద్ మ ధ్య నడిచే డెమో రైలును రద్దు చేసినట్లు దక్షి ణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు (77601/77602) డెమో ౖరైలు రాక పోకలు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని సీపీఆర్వో శ్రీధర్ కోరారు.
అంకితభావంతో
పని చేయాలి
బోధన్: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాలను పరిశీలించారు. రోగులతో మా ట్లాడి వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. ఔషధ నిల్వలు, సిబ్బంది హాజరు రి జిస్టర్లను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రు లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అ న్నారు. శిథిలావస్థకు చేరిన ఆరోగ్య కేంద్రం పాత భవనాన్ని పరిశీలించి కొత్త భవనం మంజూరు వివరాలను మెడికల్ ఆఫీసర్ డా క్టర్ రాజ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
తలుపు బిగింపు
బాల్కొండ: ముప్కాల్ లోని అద్దె భవనంలో కొ నసాగుతున్న కేజీబీవీ లోని మూత్రశాలలకు బొంతలు కట్టిన వైనంపై ‘సాక్షి’లో ‘బొంతలే.. తలుపులు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ప్రధాన ద్వారానికి తలుపు బిగించారు. తలుపు బిగించడంపై హర్షం వ్యక్తం చేసిన విద్యార్థినులు నూతన భవన నిర్మాణ పనులను కూడా వెంటనే పూర్తి చేయించాలని కోరారు.
డిగ్రీ, పీజీలో ప్రవేశాలకు అవకాశం
నిజామాబాద్‌అర్బన్: ప్రొఫెసర్ రామ్‌రెడ్డి దూరవిద్యా కేంద్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు కో ఆర్డినేటర్ రాము ఒక ప్రక టనలో తెలిపారు. డిగ్రీ, పీజీలో డిప్లొమా కోర్సుల్లో రెండో దఫా ప్రవేశాలకు అవకాశం ఉందని, ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99126 70252 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment