డొంకేశ్వర్(ఆర్మూర్): తనకున్న ఎకరం భూమిలోనే పసుపు సాగు చేస్తున్న రైతు గోక నారాయణ అద్భుత దిగుబడులు సాధిస్తున్నాడు. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన నారాయణ గత ఆరేళ్లుగా పసుపు సాగు చేస్తున్నాడు. నేల స్వభావమో, ఎరువుల పనితమో లేదా రైతు చేతి గుణమో తెలియదు కానీ.. ఎకరానికి పన్నెండు ట్రాక్టర్ల పసుపు దిగుబడి వస్తోంది. అన్ని పద్ధతులు పాటించి సాగు చేస్తేనే కష్టం మీద ఎకరానికి ఎనిమిది ట్రాక్టర్ల దిగుబడి (25 నుంచి 30 క్వింటాళ్లు) వస్తుంది. అలాంటిది గోక నారాయణకు ఎకరానికి పన్నెండు ట్రాక్టర్ల (దాదాపు 40 క్వింటాళ్లు) దిగుబడి రావడం ఆశ్చర్యపరిచే విషయమే. వరుసగా గత ఆరేళ్లుగా ఇదే దిగుబడిని రావడం తనను కూడా ఆశ్చర్యాన్ని గురిచేస్తోందని సదరు రైతు పేర్కొంటున్నాడు. అందరిలాగే తను కూడా పశువులు, గొర్ల ఎరువు ఉపయోగించడంతోపాటు డ్రిప్ ద్వారా పదిహేను రోజులకోసారి నత్రజని, పొటాష్, పాస్పరస్ అందిస్తానని ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి ఏటా సాంగ్లి మార్కెట్‌కు వెళ్లి పసుపు దిగుబడిని విక్రయిస్తున్నట్లు చెప్పాడు.
ఎకరానికి 12 ట్రాక్టర్ల పసుపు
ఆదర్శంగా నిలుస్తున్న డొంకేశ్వర్ రైతు గోక నారాయణ
ఆశ్చర్యపోతున్న తోటి రైతులు
Comments
Please login to add a commentAdd a comment