నిజామాబాద్ రూరల్: ముస్లిములకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇచ్చింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ముస్లిములు నెల రోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్షలను చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మతపెద్దలు తెలిపారు. ప్రార్థనల కోసం ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మసీదులు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలోని అన్ని మసీదులు ముస్లిములతో సందడిగా మారాయి. రంజాన్ పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకొని మసీదుల్లో ఇషా నమాజ్ తర్వాత తరవీహ్ (రంజాన్ ప్రత్యేక నమాజు)ను ఆచరిస్తారు. రంజాన్ సందర్భంగా ముస్లిం ఇమామ్(మత గురువు)లు ప్రత్యేక నమాజులలో భాగంగా ఖురాన్ పారాయణాన్ని మొదలుపెడతారు. ఉపవాసాలు ముగించేందుకు ఇఫ్తార్‌కు అవసరమైన ఖర్జూరాలు, పండ్లు విక్రయించేందుకు పలుచోట్ల దుకాణాలు వెలిశాయి.
Comments
Please login to add a commentAdd a comment