మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
పిట్లం: మద్యానికి బానిసైన ఓ యువకుడు పురుగుల ముందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలంలోని కోమటి చెరువు తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోమటి చెరువు తండాకు చెందిన రమావత్ అనిల్ (22) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంమీద విరక్తితో శనివారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి తులసిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment