ఎట్టకేలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సొమ్మును ఖాతాల్లో జమ చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. దీంతో బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని 28, కామారెడ్డి జిల్లాలోని నాలుగు కుటుంబాలకు సాయం అందింది. జిల్లాకు రూ.1.75 కోట్లు కేటాయించారు. అంటే 35 కుటుంబాలకు సాయం అందనుంది. ఏడాది కాలంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన వారిలో జిల్లా వాసులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసిన 28 కుటుంబాలకు సాయం సొమ్ము జమ చేశారు. కేటాయించిన నిధుల్లో మరో ఏడు కుటుంబాలకు సాయం అందించడానికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. ఆలస్యంగానైనా గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందించడంతో వలస కార్మికుల సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో 28,
కామారెడ్డిలో నాలుగు కుటుంబాలకు
అందిన సాయం
కృతజ్ఞతలు తెలిపిన
బాధిత కుటుంబాలు
రుణపడి ఉంటాం
గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున సాయం అందించడంతో సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం. గల్ఫ్ మృతుల్లో అత్యధికులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది. వైఎస్సార్ తర్వాత ఇంతటి సాయం అందించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి కావడం విశేషం.
– మంద భీంరెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్
గల్ఫ్ వలసదారులకు ఎంతో మేలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఇందులో గల్ఫ్ మృతుల కుటుంబాలకు సాయం అందించడం ఎంతో ప్రధానమైనది. ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్‌కు వలస వెళ్లిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయం.
– తక్కూరి సతీశ్, కాంగ్రెస్ నాయకులు, మోర్తాడ్
ఎట్టకేలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
ఎట్టకేలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
Comments
Please login to add a commentAdd a comment