● చికిత్స పొందుతూ మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన వల్లకాటి లింగం(48) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 17న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తన తండ్రి లింగంను కొట్టినట్లు కొడుకు శేఖర్ డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని లింగంను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఘటనపై కొడుకు శేఖర్ చెప్పే మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే ఆస్తి కోసం తండ్రిని గాయపర్చినట్లు ఒప్పుకున్నాడు. శేఖర్ కొంతకాలం నుంచి తండ్రికి దూరంగా హైదరాబాద్‌లో ఉంటుండగా, లింగం శెట్పల్లిలో నివసిస్తున్నాడు. కొద్దిరోజులుగా శేఖర్ ఆస్తి కోసం తండ్రితో గొడవపడుతున్నట్లు తెలిపారు. 15 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన లింగం సోమవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. శేఖర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
మోపాల్: మండల కేంద్రంలో సోమవారం ని ర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. మద్యం తాగి బైక్ నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా ద్విచక్రవాహనాలు నడిపిస్తున్న 23 మందికి జరిమానా విధించినట్లు ఎస్సై తెలి పారు. ఆయన వెంట ఏఎస్సై రమేశ్‌బాబు, హెచ్‌సీ గంగాధర్, కానిస్టేబుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment