
బీజేపీ శ్రేణుల సంబరాలు
సుభాష్‌నగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ, తపస్ బలపర్చిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపుతో బీజేపీ శ్రేణులు జిల్లా కేంద్రంలో సోమవారం సంబరాలు నిర్వహించాయి. జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి నిఖిల్‌సాయి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా మోదీ నాయకత్వంపై విశ్వాసంతో ఉపాధ్యాయులు మల్క కొమరయ్యకు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించి చరిత్ర సృష్టించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండా ఆశన్న, పద్మారెడ్డి, గంగోనె గంగాధర్, ఇప్పకాయల కిశోర్, దొంతుల రవి, జగన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment