
చేనేత సంఘాన్ని సందర్శించిన అధికారులు
రుద్రూర్: మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని హ్యాండ్‌లూవ్‌్సు అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హేమలత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంఘంలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో భాగంగా చేనేత, అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి నెలవారీగా 8శాతం కాంట్రిబ్యూషన్ చేస్తే ప్రభుత్వం రెండింతలు జమ చేస్తుందన్నారు. గతంలో మూడేళ్ల వరకు పొదుపుల వ్యవధి ఉండగా, ప్రభుత్వం రెండేళ్లకు తగ్గించిందని తెలిపారు. కార్యక్రమంలో సీడీఈలు ఎస్. నరేందర్, ఎస్. వేణు, చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కురి నారాయణ, సంఘం మేనేజర్ ఈర్వ నాగరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ అడిషనల్
కంట్రోలర్‌గా సంపత్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూని వర్సిటీ అడిషనల్ కంట్రోలర్ (కాన్ఫిడెన్షియల్)గా అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.సంపత్ నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ టి.యాద గిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సోమవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. గత దశాబ్ద కాలంగా ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సంపత్ సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో అడిషనల్ కంట్రోలర్‌గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్‌లకు సంపత్ కృతజ్ఞతలు తెలిపారు.
రేపు ప్రయోగాల
ప్రదర్శన సదస్సు
తెయూ(డిచ్‌పల్లి): జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5న జీవ సాంకేతిక శాస్త్ర ప్రయోగాల ప్రదర్శన సద స్సు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ ప్రసన్నశీల తెలిపారు. సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సోమవా రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రసన్న శీల మాట్లాడుతూ సదస్సుకు తెయూ పరిధి లోని అనుబంధ కళాశాలల విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జీవ సాంకేతిక శాస్త్ర ప్ర యోగ పద్ధతులు,అందుకు ఉపయోగించే పరికరాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వీసీ, రిజిస్ట్రార్‌లు సూచించారు. కార్యక్రమంలో సదస్సు కోకన్వీనర్ కిరణ్మయి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత సంఘాన్ని సందర్శించిన అధికారులు

చేనేత సంఘాన్ని సందర్శించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment