రెంజల్(బోధన్): రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన జంగం నవీన్ (36) జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన నవీన్ గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన రైతులు కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్క శోభ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాలుగా భార్యకు దూరమైన నవీన్ మద్యానికి బానిస కావడంతో ఆరోగ్యం క్షిణించి మతిస్థిమితం కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో వృద్ధురాలు..
కమ్మర్‌పల్లి: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన జల్లెండ్ల మల్లు(64) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్యహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మరణించింది. మృతురాలి కొడుకు అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో ఒకరు..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన సాకలి మెత్కు సాయిలు(45) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాయిలు ఇటీవల కూతురు పెళ్లి చేయగా అప్పులు పెరిగిపోయా యి. దీంతో మద్యానికి బానిసైన సాయిలు తన చే ను వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు..
కామారెడ్డి క్రైం: రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. వి వరాలిలా ఉన్నాయి. వేకువజామున 1 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్ యార్డు వద్ద పట్టాలపై ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని రైల్వే పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు 25–30ఏళ్ల మధ్య ఉంటుందని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు నలుపు రంగు కార్గో ప్యాంటు, తెలుపు రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment