
క్రైం కార్నర్
ఇనుప చువ్వల కోసం వెళ్లి ఒకరి మృతి
నందిపేట్(ఆర్మూర్): ఇనుప చువ్వల కోసం చెరువులోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన నాగం రవి(52) వృత్తిరీత్యా గోడలకు సున్నాలు వేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం నందిపేట బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఊర చెరువులో వినాయక విగ్రహాల ఇనుప చువ్వల కోసం దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగం రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ..
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో పూల్‌సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో గాయపడిహైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వరూప(32) సోమవారం మరణించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు
కమ్మర్‌పల్లి: మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఓవ్యక్తికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆర్మూర్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి తీర్పు వెలువరించారు. కమ్మర్‌పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని మండల కేంద్రానికి చెందిన తుదిగేన దేవేందర్‌పై 2019లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణ అనంతరం పోలీసులు నిందితుడిపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి సోమవారం తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ రాజును ఎస్సై అనిల్‌రెడ్డి అభినందించారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్
Comments
Please login to add a commentAdd a comment