
అంతర్జాతీయస్థాయికి పసుపు ఉత్పత్తులు
జక్రాన్‌పల్లి/కమ్మర్‌పల్లి: పసుపు ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని జాతీయ పసుపు బోర్డు కార్యద్శరి ఎన్ భవానీశ్రీ అన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (జేఎంకేపీఎం)పసుపు పరిశ్రమతోపాటు, కమ్మర్‌పల్లిలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితోపాటు భవానీశ్రీ సందర్శించారు. పరిశోధన కేంద్రంలో సాగైన పసుపు రకాలను పరిశీలించి, వాటి గురించి వివరాలు, నాణ్య త, కుర్కుమిన్, దిగుబడి, వ్యయం తదితర అంశాలతో పాటు ఏయే అంశాలపై పరిశోధన సా గుతోందనే విషయాలను శాస్త్రవేత్త మహేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో పసుపు ధర లభ్యతపై చర్చించారు. జాతీయస్థాయిలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఇప్పటి వరకు స్పైసెస్ బోర్డు ద్వారా ఎగుమతి చేసుకుంటూ వచ్చామన్నారు. అయితే ప్రస్తుతం పసుపులో ఎంత పొటెన్షియల్ ఉందని, జాతీయ స్థాయిలో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే దానిని పరిశీలిస్తున్నామ న్నారు. పసుపులో పొటెన్షియల్ పెంచుకుని మార్కెటింగ్, బ్రాండింగ్, గ్రేడింగ్ ఎలా చేసుకోవచ్చనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. పసుపును అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. వారివెంట పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నూతికాడి భోజన్న, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఉన్నారు.

అంతర్జాతీయస్థాయికి పసుపు ఉత్పత్తులు
Comments
Please login to add a commentAdd a comment