
త్వరలో గల్ఫ్ అమరుల సంస్మరణ సభ
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో మరణించిన వారిని స్మరిస్తూ ప్రత్యేక సభను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసిన నేపథ్యంలో వారితో సహపంక్తి భోజనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిల విజ్ఞప్తి మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలతో సమావేశానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ నెలలోనే ప్రజాభవన్ వేదికగా గల్ఫ్ అమరుల సంస్మరణ సభ నిర్వహించనున్నారు.
సీఎం అంగీకరించడం గొప్ప విషయం
గల్ఫ్ అమరుల సంస్మరణ సభతోపాటు, ఎక్స్‌గ్రేషి యా అందుకున్న కుటుంబాలతో సహపంక్తి భోజ నాలకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించడం గొప్ప విషయం. గల్ఫ్ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడంతోనే మెజారిటీ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని సీఎంకు వివరించాం.
– ఈరవత్రి అనిల్, టీజీఎండీసీ చైర్మన్
మృతుల కుటుంబాలతో సహపంక్తి
భోజనం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించిన నేపథ్యంలో కార్యక్రమానికి శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment