మోదీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరగదు
సుభాష్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదని, రా ష్ట్రంలోని ప్రాజెక్టులకు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారన డం సరికాదని ఎంపీ అ ర్వింద్ ధర్మపురి పేర్కొన్నా రు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సీఎం కార్యాలయ అధికారులను ప్రాజెక్టుల డీపీఆర్‌లతో పంపించాలని, తాను కిషన్‌రెడ్డిని వెంట తీసుకువస్తానని, వెంటనే ఎక్కడ అడ్డుపడ్డారో తేలిపోతుందని సవాల్ విసిరారు. ప్రధాని మోదీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని తెలిపారు. మూసీ ప్రక్షాళన డీపీఆర్ తప్పులతడకగా ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలని, కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, మహిళలు చీపుర్లు పట్టుకుని కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జాతీయస్థాయి పసుపు బోర్డు ఏర్పాటులో తాను కీలకపాత్ర పోషించానని, రెగ్యులర్‌గా కేంద్రం నుంచి జరిగే అభివృద్ధిని చేయలేమా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి పనికిమాలిన
రాజకీయాలు మానుకోవాలి
ఎంపీ అర్వింద్ ధర్మపురి
Comments
Please login to add a commentAdd a comment