పరిష్కారం లేని ప్రజావాణి! | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం లేని ప్రజావాణి!

Published Tue, Mar 4 2025 2:22 AM | Last Updated on Tue, Mar 4 2025 2:22 AM

పరిష్

పరిష్కారం లేని ప్రజావాణి!

ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి ఫలితం ఇవ్వడం లేదనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ఒక్కో అర్జీదారు పదులసార్లు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నా వారి సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం ‘ప్రజావాణి’ పనితీరును ఎత్తిచూపుతోంది. వ్యక్తిగత ఫిర్యాదులను పక్కన పెడితే.. సామాజిక అంశాలపై అందుతున్న ఫిర్యాదులూ పరిష్కారానికి నోచుకోవడం లేదు.

నిజామాబాద్‌అర్బన్‌ /ఎడపల్లి(బోధన్‌): కలెక్ట రేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పోలీసులపైనే ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌ నగరంలోని బడాబజార్‌కు చెందిన హరీశ్‌ తన ఫిర్యాదులో పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. సీసీఆర్‌బీ సీఐ సతీశ్‌, ఐదో టౌన్‌ ఎస్సై గంగాధర్‌, ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సదానందం, డీసీపీ బస్వారెడ్డి నుంచి తనకు ముప్పు ఉందని, తనపై చైన్‌స్నాచింగ్‌ అంటూ తప్పుడు కేసు నమోదు చేశారని ఫిర్యా దు చేశాడు. అధికారులు న్యాయం చేయాలని కోరాడు. అదేవిధంగా బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని రెంజల్‌ మండలం దూపల్లికి చెందిన బోయ భాగ్య ఫిర్యాదు చేసింది. గతనెల 13న లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో తన పర్సు పోవడంతో పోలీస్‌ అవుట్‌ పోస్టులో ఫిర్యాదు చేశానని, అక్కడే ఉన్న సీఐ విజయ్‌బాబు నా మాట వినిపించుకోకుండా లాఠీతో కొట్టాడని పేర్కొంది. దీనిపై ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో, బోధన్‌ ఏసీపీ, ఇన్‌చార్జి సీపీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకు, కోడలు అన్నం పెట్టడం లేదని సావెల్‌కు చెందిన నర్సయ్య ఫిర్యాదు చేశాడు. 12 ఇసాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, భూమి తీసుకున్న తరువాత కూడా తనను పట్టించుకోవడం లేద న్నాడు. కొడుకు, కోడలు పట్టించుకోకపోవడంతో గుడి వద్ద బిచ్చమెత్తుకుంటున్నానని ఫకీరాబాద్‌కు చెందిన గుడ్డి ముత్తెమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. భర్త చనిపోయిన నాటి నుంచి ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో రామాల యం వెనుక చేపట్టిన ఓ ప్రార్థనా మందిరం అక్ర మ నిర్మాణాన్ని అడ్డుకోవాలని హిందూ సంఘా ల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ మళ్లీ నిర్మా ణం చేపడుతున్నారని పేర్కొన్నారు. నిర్మాణాని కి అనుమతులు, రిజిస్ట్రేషన్‌ లేదన్నారు. ప్రజావాణిలో మొత్తం 62 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌కుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, డీపీవో శ్రీనివాస్‌, నిజామాబాద్‌ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి అర్జీలను స్వీకరించారు.

ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా

సమస్యలు యథాతథం

తక్షణ పరిష్కారంపై

యంత్రాంగం నిర్లక్ష్యం

సామాజిక సమస్యల పరిష్కారాన్నీ

పట్టించుకోని వైనం

పోలీసుల నుంచి ప్రాణహాని

ప్రజావాణిలో వెల్లువెత్తిన ఫిర్యాదులు

కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదు.. బిచ్చమెత్తుకుంటున్నానని ఓ తల్లి ఆవేదన

సమస్యల పరిష్కారానికి ఆదేశించిన

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

No comments yet. Be the first to comment!
Add a comment
పరిష్కారం లేని ప్రజావాణి!1
1/1

పరిష్కారం లేని ప్రజావాణి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement