అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
● ఇద్దరికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని రామారెడ్డి–సదాశివనగర్ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈఘటనలో కారులోని ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం కారులో రామారెడ్డి నుంచి సదాశివనగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో వారి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ట్రాక్టర్ – కారు ఢీ: ముగ్గురికి గాయాలు
రుద్రూర్: మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బోధన్–రుద్రూర్ ప్రధాన రహదారిపై ట్రాక్టర్ – కారు ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్షతగాత్రులు రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment